రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్యూనివర్సిటీలో మంగళవారం మాస్టర్‌చెఫ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. గీతం వర్సిటీ, హైదరాబాద్‌లోని కుకింగ్ క్లబ్సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీలో వందలాది మంది స్టూడెంట్స్పాల్గొని పాకశాస్ర్తంలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు.
ఇండియన్, చైనీస్ వంటకాలతో పాటు వెస్ర్టన్ఫుడ్స్, డిజర్ట్స్ తయారు చేసి తమలోని ప్రతిభను బయటకు తీశారు. గీతం వీసీ డీఎస్‌రావు, రెసిడెంట్ డైరెక్టర్వర్మ స్టూడెంట్స్తయారు చేసిన వంటకాలను రుచి చూసి ప్రశంసలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకశాస్త్రానికి లింగ భేదం ఉండదని ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చూపించవచ్చన్నారు. అనంతరం బెస్ట్ఫుడ్తయారు చేసిన స్టూడెంట్స్‌కు బహుమతులు అందజేశారు.