సీఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంకర్​కు మాస్టర్ మైండ్స్ ఘన సన్మానం

  • రూ.లక్ష చెక్కు​ను గిఫ్ట్​గా అందించిన యాజమాన్యం

హైదరాబాద్: సీఏ ఫైనల్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆర్.రిషబ్ ఓస్వాల్ ను మాస్టర్ మైండ్స్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. శాలువాతో సన్మానించి రూ.లక్ష చెక్ ను గిఫ్ట్ గా అందించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ మాట్లాడారు. సీఏ విద్యా విధానం గురించి తెలియజేశారు. కామర్స్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. 

స్టూడెంట్లు ఐఐటీ, నీట్ లాంటి పరీక్షలవైపు మాత్రమే కాకుండా సీఏ వైపు కూడాచూడాలని కోరారు. విద్యార్థులు మంచి కెరీర్ ను ఎంచుకోవడానికి కామర్స్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం రిషబ్ ఓస్వాల్ మాట్లాడారు. తనను ప్రోత్సహించిన  మాస్టర్ మైండ్స్ సంస్థ, తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పారు.