మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) కోర్సు 2023-–24 విద్యాసంవత్సరం అడ్మిషన్లకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించేందుకు కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హత: కనీసం 50 శాతంతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు పరిమితి లేదు. ఎంట్రన్స్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆగస్టు 27న నిర్వహిస్తారు. వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.