ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, అలానే ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు పూర్తయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పేరుతో రచయిత పులగం చిన్నారాయణ, ఐఆర్ఎస్ అధికారి రవి పాడి ప్రచురించిన పుస్తకాన్ని దర్శకుడు హరీష్ శంకర్ లాంచ్ చేశారు.
ఇందులో 45 మంది దర్శకులు, ఏడుగురు రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన 62 వ్యాసాలు ఇందులో ఉన్నాయి. తొలి కాపీని హరీష్ శంకర్‌కు, రెండో కాపీని నటులు నాజర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, మోహనకృష్ణ ఇంద్రగంటి, వీరశంకర్, చంద్రసిద్ధార్థ, శివ నాగేశ్వరరావు, కరుణ కుమార్, సునీల్ కుమార్ రెడ్డి, సాయి కిషోర్ మచ్చా, రమేష్ సామల, శ్రీమన్ వేముల తదితరులు పాల్గొన్నారు.