- ఐదు మాస్టర్ ప్లాన్లకు అదనంగా కొత్త ప్లాన్
- మూసీ125 కి.మీల పరిధిలో తయారీ
- నాలుగు జోన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం
- నదికి ఇరువైపులా కిలోమీటర్ మేర గ్రోత్ కారిడార్
- డిసెంబర్ నాటికి సిద్ధం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా పక్కా ప్లాన్ప్రకారం మూసీ పరిసరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) ప్రత్యేక మాస్టర్ ప్లాన్రూపొందించాలని డిసైడ్అయ్యింది.
ఇప్పటికే ఉన్న ఐదు మాస్టర్ ప్లాన్లకు అదనంగా కొత్త ప్లాన్రూపొందించనుంది. బల్దియా, హుడా, సైబరాబాద్, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్అథారిటీ, హెచ్ఎండీఏ పరిధిలో ఎక్స్టెండెడ్మాస్టర్ప్లాన్లు అమలులో ఉండగా..మూసీ పరిసరాల కోసం ప్రత్యేకంగా 125 కిలోమీటర్ల పరిధిలో ప్లాన్తయారు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్టెండర్లను ఆహ్వానించగా నాలుగు కంపెనీలు అర్హత సాధించాయి.
ఇందులో ఒక కంపెనీకి టెండర్లు ఖరారు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టెండర్ దక్కించుకున్న కంపెనీ డిసెంబర్చివరి నాటికి మాస్టర్ ప్లాన్సిద్ధం చేస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఫీల్డ్లెవెల్లో అధికారులు సర్వే పూర్తి చేశారు.
నాలుగు జోన్లుగా అభివృద్ధి!
125 కిలోమీటర్ల విస్తీర్ణంలో మూసీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, అలాగే నదికి రెండు వైపులా కిలోమీటర్ పరిధిని గ్రోత్కారిడార్గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. మొత్తం నాలుగు జోన్లుగా అభివృద్ధి చేయాలని. ఇందులో హెరిటేజ్, రిక్రియేషన్, ఎకలాజికల్, మెట్రో జోన్లు ఉండనున్నాయి. మూసీ చుట్టూ చారిత్రక కట్టడాలను కాపాడడం, వాటిని అందంగా తీర్చిదిద్ది టూరిజం హబ్‌గా రూపొందించాలని కూడా ప్రపోజల్స్సిద్ధం చేశారు.
ఏ జోన్లో ఏముంటుంది?
మూసీ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత నగరానికి భారీ సంఖ్యలో టూరిస్టులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రత్యేకంగా టూరిజం అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్‌లో రిక్రియేషన్ జోన్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ జోన్లో భాగంగా ల్యాండ్‌స్కేప్‌లు, పార్కుల నిర్మాణం, ఓపెన్స్పేస్తో పాటు కమర్షియల్కాంప్లెక్స్‌లు, ఎంటర్టైన్మెంట్కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
ఎకలాజికల్జోన్లో పర్యావరణ అభివృద్ధి, మూసీలో నీటి నాణ్యతను పెంచడం, వరద నిర్వహణ, పర్యావరణ వ్యవస్థను అంచనా వేయడంతోపాటు భూ వినియోగంపై ప్రణాళికలు రూపొందిస్తారు. డ్రింకింగ్‌వాటర్, కరెంట్, ట్రంక్లైన్స్, సైకిల్‌ట్రాక్ ల వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. మెట్రోజోన్‌లో నది చుట్టూ హైరైజ్ భవనాలు, కమర్షియల్కాంప్లెక్స్‌లు, లాజిస్టిక్ హబ్స్ వంటివి తీసుకు రానున్నారు.
అభివృద్ధికే అధిక ప్రాధాన్యం
మూసీకి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించడం ద్వారా అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. మూసీకి తూర్పున గౌరెల్లి నుంచి పశ్చిమాన నార్సింగ్ ఔటర్రింగ్రోడ్వరకూ మూసీని అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 55 కిలోమీట్ల పరిధిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. నది వెడల్పు 300 మీటర్లు కాగా, ఇరువైపులా ఒక కిలోమీటర్పరిధిని గ్రోత్ కారిడార్‌గా డెవలప్ చేయనున్నారు.
మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. మూసీలో నిర్వాసితులకు పునరరావాసం కల్పించిన రత్వాత మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.