![గ్రేటర్ వరంగల్‌లో అభివృద్దికి అడ్డంకులు](https://static.v6velugu.com/uploads/2022/04/Master-plan-for-development-in-Greater-Warangal-is-yet-to-be-implemented_TxcfS7sz1i.jpg)
- ఇంకా 1971 నాటి ప్లానే అమలు చేస్తున్రు
- సిటీలో ఎటుచూసినా అడ్డదిడ్డంగా నిర్మాణాలు
- రెండేళ్లుగా సీఎం ఆఫీస్‍లో పడిఉన్న కొత్తప్లాన్
వరంగల్, వెలుగు: వరంగల్ సిటీని 2041 నాటి అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు తయారు చేసిన ‘కుడా’ మాస్టర్ప్లాన్కుమున్సిపల్ మంత్రి కేటీఆర్రెండేండ్ల కిందటే గ్రీన్‍సిగ్నల్ ఇచ్చినా.. సీఎంవో అప్రూవల్ రాక అమలుకు నోచుకోవడంలేదు. 50 ఏండ్ల కిందట రూపొందించిన ప్లానే ఇప్పటికీ అమల్లో ఉంది. పెరుగుతున్న సిటీ పరిధి, జనాభాకు తగ్గట్టు 15, 20 ఏళ్లకోసారి మాస్టర్ ప్లాన్ ను రివైజ్ చేయాల్సిఉన్నా సర్కారు పట్టించుకోలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటినుంచి కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని చెప్తున్నారు. గత ఏడాది గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడికి వచ్చిన కేటీఆర్.. వరంగల్ ను ఫ్యూచర్ సిటీగా మారుస్తామని కూడా ప్రకటించారు. ఆ దిశగా అడుగు పడడం లేదు.
సిటీ పరిధి బాగా పెరిగింది..
స్మార్ట్‌సిటీల ఏర్పాటు మాస్టర్ ప్లాన్ అమలుతోనే సాధ్యమని, సరైన మాస్టర్ ప్లాన్ లేకుంటే నగరాలు డెవలప్ కావని నీతి అయోగ్ భావిస్తోంది. సరైన ప్లాన్లు తయారు చేసుకోవాలని బల్దియాలకు సూచించింది. 20 ఏండ్లపాటు అభివృద్ధికి తగ్గట్టు 1971లో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ ను కొంత సవరించి 1972 నుంచి అమలు చేస్తున్నారు. ఈ లెక్కన 1991లో కొత్త మాస్టర్‌ప్లాన్ తీసుకురావాల్సి ఉన్నా పట్టించుకోలేదు. 2013లోనే కొత్త ప్లాన్ తయారుచేసినప్పటికీ వివిధ కారణాలతో పక్కన పెట్టేశారు. సిటీ పరిధి 60 చదరపు కిలోమీటర్లుగా ఉన్నప్పుడు ఈ ప్లాన్ రెడీ చేశారు. ఆ తర్వాత 181 గ్రామాలు గ్రేటర్లో విలీనమయ్యాయి. దీంతో సిటీ పరిధి 1,801 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ స్కీమ్‌లకు వరంగల్ సెలక్ట్ కావడంతో మెరుగైన ప్లాన్ తయారు చేయాలని భావించిన కుడా ఈ బాధ్యతను లీ అసోసియేట్స్ అనే ఇంటర్నేషనల్సంస్థకు అప్పగించింది. వరంగల్ సిటీలో రెసిడెన్షియల్ , కమర్శియల్, మిక్స్ డ్ యూజ్ జోన్, ఇండ్రస్ట్రీయల్ జోన్, గ్రోత్ కారిడార్, అగ్రికల్చర్, హెరిటేజ్ కన్జర్వేషన్ తదితర జోన్లను అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్లాన్‌లో మార్పులు చేశారు. పార్కులు, గార్డెన్లు, గ్రీన్ బఫర్స్ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్లాన్అప్గ్రేడ్ చేశారు.
రెండేళ్లుగా..మూలకుపెట్టిన్రు
కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కుడా మాస్టర్ ప్లాన్ అమలు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ప్లాన్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, సిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలందరూ ఓకే చేసి.. ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి ప్లాన్అప్రూవల్ చేయాలని కోరారు. చర్చల తర్వాత 2020 మార్చి 11న మంత్రి కేటీఆర్ మాస్టర్‌ప్లాన్ అమలుకు గ్రీన్‍సిగ్నల్ ఇచ్చి.. సీఎం ఆఫీస్ కు పంపారు. అయితే ఈ ప్లాన్‌పై కేసీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారని, కొన్ని మార్పులు సూచించారని లోకల్ లీడర్లు చెప్పారు. దీంతో ప్లాన్ అమలుకు నోచుకోవడంలేదు. మాస్టర్ ప్లాన్ అమల్లోకి రాకపోవడంతో సిటీలో చెరువులు, కుంటలు, కబ్జాకు గురవుతున్నాయి. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. డెవలప్మెంట్ వర్క్స్కూడా అడ్డదిడ్డంగా చేపడుతున్నారు. ఇది వరద ముప్పనకు కారణమవుతోంది.