మాస్టర్ కార్డ్ మాస్టర్ స్ట్రోక్ : అప్పులిచ్చే క్రెడిట్ కార్డు కంపెనీలోనే ఉద్యోగుల కోతనా..

మాస్టర్ కార్డ్ మాస్టర్ స్ట్రోక్ : అప్పులిచ్చే క్రెడిట్ కార్డు కంపెనీలోనే ఉద్యోగుల కోతనా..

ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్నాయి.. ఆ కంపెనీ.. ఈ కంపెనీ అని తేడా లేదు.. ప్రతి కంపెనీలో ఉద్యోగుల తీసివేత కొనసాగుతుంది. విచిత్రం ఏంటంటే.. మాస్టర్ కార్డ్.. అదేనండీ డెబిట్, క్రెడిట్ కార్డుల కంపెనీ మాస్టర్ కార్డ్ సైతం.. ఉద్యోగుల తీసివేతను ప్రకటించటం సంచలనంగా మారింది. 

ప్రపంచ వ్యాప్తంగా మాస్టర్ కార్డులో కంపెనీలో 33 వేల 400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 3 శాతం అంటే.. వెయ్యి మంది అంతకు మించి ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించింది కంపెనీ. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఈ తొలగింపు ప్రక్రియ పూర్తవుతుంది అంటూ అంతర్జాతీయ కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన క్వార్టర్ రిజల్ట్స్ లో.. కంపెనీ ఆదాయం పెరిగినా.. లేఆఫ్స్ ప్రకటించటంపై విమర్శలు వస్తున్నాయి 

మాస్టర్ కార్డు దీర్ఘకాలిక పెట్టుబడులు, కంపెనీ నిర్వహణలో కొత్త విధానాలు అమలు చేయటంలో భాగంగానే ఉద్యోగుల తొలగింపు అనివార్యం అని కంపెనీ ప్రకటించింది. కంపెనీ లక్ష్యాలను వేగంగా ముందుకు తీసుకెళ్లటంలో భాగంగా.. కొత్త ఉద్యోగాల నియామకం కూడా ఉండొచ్చని కంపెనీ వర్గాలు వివరించాయి. ప్రస్తుతానికి 2024, సెప్టెంబర్ 30వ తేదీలోపు ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపు అయితే కచ్చితంగా ఉంటుందని కంపెనీ వివరించింది. 

న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా ఉన్న మాస్టర్ కార్డు.. అమెరికా మినహా మిగతా దేశాల్లోనే 80 శాతం టర్నోటర్, మార్కెటింగ్ కలిగి ఉంది. 

మరిన్ని వార్తలు