ఈ మధ్యనే వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు బుధవారం(అక్టోబర్ 09) టీడీపీలో చేరారు. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో వీరు తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. మోపిదేవి, మస్తాన్ రావుకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కాగా, రాజీనామా చేసొస్తేనే పార్టీలోకి ఆహ్వానిస్తామని టీడీపీ అధినేత స్పష్టం చేయడంతో.. ఆగస్టులో ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం వీరి రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. అంతకముందు వీరిద్దరూ ఎంపీ పదవులతోపాటు వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాగా, మోపిదేవికి జగన్ సన్నిహితుడిగా మంచి పేరుంది.
ALSO READ | జమిలి ఎన్నికలు పెడితే నష్టమేంటి ? : సీఎం చంద్రబాబు