రికార్డులు బ్రేక్‌.. ఫ్యాన్స్‌ ఖుష్‌

రికార్డులు బ్రేక్‌.. ఫ్యాన్స్‌ ఖుష్‌

ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌ ఫ్యాన్స్​కు మస్తు కిక్ ఇచ్చింది. దసరా రోజున కూడా ఈ మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వచ్చారు. వాళ్లకు ఇండియా క్రికెటర్లు డబుల్ ట్రీట్ ఇచ్చారు. సంజు శాంసన్‌, సూర్యకుమార్‌‌తో పాటు మిగతా ఆటగాళ్లూ  ఫోర్లు, సిక్సర్లతో దంచికొట్టడంతోఅభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

 ఈ మ్యాచ్‌లో టీ మిండియా పలు రికార్డులు బద్దలు కొట్టడమే కాకుండా ఘన విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత భారీ ఫైర్ వర్క్స్‌ ఆకట్టుకుంది. ఈ  మ్యాచ్‌ను విజ‌య‌వంతంగా నిర్వహించడానికి  10 రోజుల పాటు శ్రమించిన హెచ్‌సీఏ సభ్యులు, గ్రౌండ్ సిబ్బందికి హెచ్​సీఏ ప్రెసిడెంట్ జ‌గ‌న్‌ మోహ‌న్ రావు ధ‌న్యవాదాలు తెలిపారు. - హైద‌రాబాద్‌, వెలుగు