ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్ ద టైగర్ లాంటి చిత్రాలతో కమెడియన్‌గా గుర్తింపును తెచ్చుకుని, తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు అభినవ్ గోమఠం. తాజాగా తన పాపులర్ డైలాగ్ అయిన ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ టైటిల్‌తో సినిమా వస్తోంది. ఇందులో తనే హీరోగా నటిస్తున్నాడు. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వైశాలి రాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రీసెంట్‌గా ఈ మూవీ టైటిల్ లోగోను దర్శకుడు తరుణ్ భాస్కర్ రిలీజ్ చేసి టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఫిబ్రవరి సెకెండ్ వీక్‌లో వంశీ నందిపాటి వరల్డ్‌వైడ్‌గా సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.