
ఖైరతాబాద్, వెలుగు: మానవజాతి మనుగడలో గోవులు అత్యంత కీలక పాత్ర వహిస్తాయని మాతా నిర్మలానంద యోగ భారతి అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆమె మాట్లాడారు. ఖైరతాబాద్‌లోని శ్రీ వాసవి సేవా కేంద్రంలో మే 18న తెలంగాణలోని గోశాలల నిర్వాహకులు, గో పోషకులతో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచ గవ్యాలతో మానవులు ఆరోగ్యంగా జీవించడమెలా? రాష్ట్రంలో గోవులను ఎలా సంరక్షించుకోవాలి? మానవుడి మనుగడపై గోవుల పాత్ర వంటి తదితర అంశాలపై సదస్సులో చర్చించినట్లు చెప్పారు.
అలాగే భవిష్యత్‌లో గో రక్షణపై తీర్మానాలు చేయనున్నట్టు వివరించారు. సమావేశంలో విజయ రామారావు, లక్కరాజు విద్యారావ్, కోటి శ్రీధర్, జస్వంత్ పటేల్, వాసుదేవాయ, ప్రణవ్ పాల్గొన్నారు.