హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పుడంటే.?

హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పుడంటే.?

టాలీవుడ్ స్టార్ హీరో, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో "హరిహర వీరమల్లు" ఒకటి. ఈ సినిమాకి ప్రముఖ దర్శకులు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలసి దర్శకత్వం వహిస్తుండగా స్టార్ సినీ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపుగా 4 ఏళ్ళు అవుతున్నా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అంతేగాకుండా పవన్ ఈమధ్య ఎక్కడికెళ్లినా సినిమా అప్డేట్స్ ఇవ్వాలంటూ విసిగిస్తున్నారు. దీంతో ఇంతకుముందే సైన్ చేసిన సినిమాల షూటింగ్ పూర్తీ చెయ్యాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

అయితే పవన్ ఫ్యాన్స్ ని హరిహర వీరమల్లు చిత్ర టీమ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులోభాగంగా జనవరి 06న ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ "మాట వినాలి" అనే పాటని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమాకి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. 

ALSO READ | Allu Arjun: మరోసారి నాంపల్లి కోర్టుకి వెళ్లిన అల్లు అర్జున్.. అందుకేనా..?

అలాగే సోమవారం ఉదయం 9:06 గంటలకి ఈ పాటని రిలీజ్ చేస్తున్నామని, ఈ పాటని పవన్ కళ్యాణ్ పాడినట్లు తెలిపారు. ఈ విషయానికి సంబందించిన పోస్టర్ కూడా షేర్ చేశారు. ఈ పోస్టర్లో పవన్ డప్పు పట్టుకుని కనిపించారు. ఎట్టకేలకి పవన్ సినిమా అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా హరిహర వీరమల్లు సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ పార్ట్ "హరిహర వీరమల్లు -1  ది స్వార్డ్ వర్సెస్ స్పిరిట్" ఈ ఏడాది మర్చి 28న వరల్డ్ వైడ్ గా ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈసారైనా అనుకున్న సమయానికి వస్తుందో రాదో చూడాలి.