వన్డే వరల్డ్ కప్ ఫీవర్ మొదలైపోయింది. మరికొన్ని రోజుల్లో దేశం మొత్తం క్రికెట్ మ్యాచులు చూడటానికి రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మూడు మ్యాచులు ఉండగా.. మూడు వార్మప్ మ్యాచులు నిర్వహించనుంది ఐసీసీ. ఈ నెల అంటే సెప్టెంబర్ 29వ తేదీన ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్, న్యూజిలాండ్ వర్మప్ మ్యాచ్ ఉంది. ఇప్పటికే టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయి. అయితే 28వ తేదీ హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనం ఉంది.. అదే రోజు మిలాద్ ఉన్ నబీ ఉంది.
ఉప్పల్ స్టేడియంలో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఈనెల 29న ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్- న్యూజీలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. 28న గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నమీ ఉత్సవాలు ఉండటంతో మ్యాచ్ కు భద్రత ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు.
ఇప్పటికే ఈ మ్యాచ్ కు టిక్కెట్లు కూడా అమ్ముడుపోవడం హెచ్ సీఏ గందరగోళంలో పడంది. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహణకు హచ్ సీఏ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐకి వివరించింది హెచ్ సీఏ. నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్ టిక్కెట్లు అమ్ముడు పోవడంతో హెచ్ సీఐ సందిగ్ధంలో పడింది. ఒకవేళ ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహిస్తే టిక్కెట్ల డబ్బులు తిరిగి ఇచ్చేందుకు హెచ్ సీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
29న పాకిస్తాన్ న్యూజీలాండ్ మ్యాచ్ తో పాటు ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 3న ఆస్ట్రేలియా - పాక్ వార్మక్ మ్యాచ్ కూడా జరగనుంది. వీటితో పాటు ఉప్పల్ వేదికగా మూడు వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. అక్టోబర్ 6న పాకిస్తాన్ - నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్, అక్టోబర్ 9న న్యూజిలాండ్- నెదర్లాండ్స్, అక్టోబర్ 10న పాకిస్తాన్ శ్రీలంకల మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి.