హైదరాబాద్ లో జరిగిన ఆఖరి ఆటలోనూ.. అదే జోష్

హైదరాబాద్ లో జరిగిన ఆఖరి ఆటలోనూ.. అదే  జోష్

వెలుగు, హైదరాబాద్‌: ఐపీఎల్‌‌ –17  సీజన్‌‌ లో భాగంగా సిటీలో జరిగిన ఆఖరి మ్యాచ్‌‌ తో అభిమానులు మస్తు ఎంజాయ్ చేశారు.  ఉప్పల్‌‌ స్టేడియంలో ఆదివారం సాయంత్రం సన్ రైజర్స్‌‌ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌‌ మధ్య పోటీతో స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసింది. వాతావరణం కూడా చల్లబడి ఆహ్లాదంగా ఉండటంతో  ఆట మొదలవడానికి గంట ముందే  స్టేడియం నిండిపోయింది.  

తొలుత పంజాబ్‌‌ బ్యాటర్లు దంచికొడితే.. తర్వాత హైదరాబాద్‌‌ కూడా మెరుపులు మెరిపించడంతో  ఫ్యాన్స్‌‌ జోష్ చేశారు.  మ్యాచ్ ముగిసిన తర్వాత సన్‌‌ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు.. అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ గ్రౌండ్‌‌ చుట్టూ విక్టరీ ల్యాప్‌‌ చేశారు. గ్యాలరీల్లోని అభిమానులకు జెర్సీలు, టెన్నిస్‌‌ బాల్స్‌‌ను అందించారు. మ్యాచ్‌‌కు 35, 967 మంది ప్రేక్షకులు హాజరైనట్టు హెచ్‌‌సీఏ వర్గాలు తెలిపాయి.