IND vs BAN 2024: శాంతించిన వరుణుడు.. ఆలస్యంగా భారత్- బంగ్లాదేశ్ టెస్ట్

IND vs BAN 2024: శాంతించిన వరుణుడు.. ఆలస్యంగా భారత్- బంగ్లాదేశ్ టెస్ట్

కాన్పూర్ టెస్టులో వరుణుడు కరుణించాడు. ఉదయం నుంచి భారీగా పడుతున్న వర్షం కొద్దిసేపటి క్రితం తగ్గింది. అయితే పిచ్ పైన కవర్స్ ఇంకా అలాగే కప్పి ఉంచారు. వర్షం తగ్గినా మ్యాచ్ ఆలస్యం కానుంది. కవర్స్ తీసిన తర్వాత అంపైర్లు పిచ్ ను పరీశీలించనున్నారు. దీంతో మ్యాచ్ ప్రారంభం కావాలంటే మరో గంట సమయం పట్టేలా ఉంది. ఈ లోపు వర్షం పడితే అంపైర్లు రెండో రోజు మ్యాచ్ ను నిలిపివేయనున్నారు. 

ఇప్పటికే ఒక్క ఓవర్ పడకుండా తొలి సెషన్ అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇరు జట్ల ఆటగాళ్లు లంచ్ ముగించుకొని మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. మూడు రోజుల ఆట మాత్త్రమే మిగిలి ఉండడంతో ఈ మ్యాచ్ లో ఫలితం వచ్చేలా కనిపించడం లేదు. డ్రా లేదా రద్దయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రెండో టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఈ మ్యాచ్ రద్దయిత్ బలహీనమైన బంగ్లాదేశ్ పై గెలవాల్సిన మ్యాచ్ డ్రా చేసుకొని భారత్ కీలకమైన 6 పాయింట్లు కోల్పోనుంది.

Also Read :- 25 ఏళ్ళ కెరీర్‌కు అంపైర్ అలీమ్ దార్ రిటైర్మెంట్

మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు నిరాశ తప్పడం లేదు. తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఇప్పటికే రెండో టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (40), రహీం (6) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ కు రెండు.. అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది.