వరల్డ్ కప్ 2023: మ్యాచ్ అఫీషియల్స్ ని ప్రకటించిన ఐసీసీ

వరల్డ్ కప్ 2023: మ్యాచ్ అఫీషియల్స్ ని ప్రకటించిన ఐసీసీ


భారత వేదికగా జరగబోయే వరల్డ్ కప్ మ్యాచులకి ఐసీసీ తాజాగా మ్యాచ్ నిర్వాహకులని ప్రకటించేసింది. ICC అంపైర్ల యొక్క ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్‌లోని అందరు అంపైర్లు భారతదేశంలో జరగబోయే ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023లో అధికారికంగా వ్యవహరిస్తారు.
 
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ దశకు 20 మంది మ్యాచ్ అధికారులను ఎంపిక చేసింది. సెమీ-ఫైనల్ మరియు ఫైనల్‌కు సంబంధించిన అధికారులను టోర్నమెంట్ సమయంలో నిర్ణయించబడుతుంది.ఈ జాబితాలో 16 మంది అంపైర్లు మరియు నలుగురు మ్యాచ్ రిఫరీలు ఉన్నారు. వీరిలో 12 మంది ఐసీసీ అంపైర్ల ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్‌కు చెందిన వారు.

ALSO READ : రైతులకు 15 గంటల కరెంట్ ఇస్తే.. నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్‌కు చెందిన 12 మంది అంపైర్లు
 

క్రిస్టోఫర్ గఫానీ (న్యూజిలాండ్), కుమార్ ధర్మసేన (శ్రీలంక), మరైస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా), మైకేల్ గోఫ్ (ఇంగ్లండ్), నితిన్ మీనన్ (భారతదేశం), పాల్ రీఫిల్ (ఆస్ట్రేలియా), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్), రిచర్డ్ కెటిల్‌బరో ( ఇంగ్లండ్), రోడ్నీ టక్కర్ (ఆస్ట్రేలియా), జోయెల్ విల్సన్ (వెస్టిండీస్), అహ్సన్ రజా (పాకిస్తాన్), మరియు అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షిణాఫ్రికా).