Champions Trophy 2025: కాసేపట్లో ఇండియా, ఆస్ట్రేలియా సెమీస్.. మ్యాచ్ అఫీషియల్స్‌ వీరే!

Champions Trophy 2025: కాసేపట్లో ఇండియా, ఆస్ట్రేలియా సెమీస్.. మ్యాచ్ అఫీషియల్స్‌ వీరే!

ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, ఆస్ట్రేలియా మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా మంగళవారం (మార్చి 4) జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. రెండు సెమీ ఫైనల్స్ కు ఐసీసీ మ్యాచ్ అధికారులను ప్రకటించింది. నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి సెమీస్.. బుధవారం (మార్చి 5) సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్ లకు మ్యాచ్ అఫీషియల్స్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం. 

ALSO READ : IND vs AUS: పాండ్యపైనే ఆశలు.. హెడ్‌ను ఔట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం!

సెమీ ఫైనల్ 1: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (దుబాయ్)

ఆన్-ఫీల్డ్ అంపైర్లు: క్రిస్ గఫానీ మరియు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్
మూడవ అంపైర్: మైఖేల్ గోఫ్
నాల్గవ అంపైర్ : అడ్రియన్ హోల్డ్‌స్టాక్
మ్యాచ్ రిఫరీ: ఆండీ పైక్రాఫ్ట్
అంపైర్ కోచ్: స్టువర్ట్ కమ్మింగ్స్

సెమీ-ఫైనల్ 2: దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ (లాహోర్)

ఆన్-ఫీల్డ్ అంపైర్లు : కుమార్ ధర్మసేన మరియు పాల్ రీఫిల్
మూడవ అంపైర్: జోయెల్ విల్సన్
నాల్గవ అంపైర్: అహ్సాన్ రజా
మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లె
అంపైర్ కోచ్: కార్ల్ హర్టర్ 

రిజర్వ్ డే..

చాంపియన్స్‌ ట్రోఫీలో సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కేటాయించారు. అందువల్ల మ్యాచ్ రోజు వర్షార్పణం అయినా.. ఆ మరుసటి రోజు మ్యాచ్ నిర్వహిస్తారు. మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్‌కు మార్చి 5న రిజర్వ్ డే ఉంది. అలాగే, మార్చి 5న జరగనున్న రెండవ సెమీఫైనల్‌కు మార్చి 6న రిజర్వ్ డే ఉంది.