రంగం భవిష్యవాణి.. పాడిపంటలు బాగా పండుతయ్

సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి.  అమ్మవారి భవిష్య వాణి వినిపించారు  మాతంగి స్వర్ణలత.  పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెప్పారు. భక్తుల పూజల పట్ల సంతోషం వ్యక్తం చేసిన అమ్మవారు  ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పారు. . పాడిపంటలు బాగా పండుతాయని తెలిపారు. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు.  భక్తులను చల్లగా  కాపాడుకుంటామన్న మాతంగి స్వర్ణలత.. తెలంగాణ ప్రజలను సుభిక్షంగా కాపాడుకుంటామని తెలిపారు. రంగం కార్యక్రమానికి సీఎస్ శాంతికుమారి,మంత్రి పొన్నం పలువురు అధికారులు హాజరయ్యారు.

ఏ బోనం అయినా, ఎవరు ఎత్తుకొచ్చినా పర్వాలేదు. సంతోషంగా అందుకునేది నేనే. వీళ్ళు, వాళ్ళు తేవాలని సందేహం పెట్టుకోకండి. మట్టి బోనం అయినా, స్వర్ణ బోనం అయినా...ఎవరు తెచ్చిన సంతోషంగా అందుకునే బాధ్యత నాది .పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను.  నా రూపం పెట్టాలి అనుకుంటున్నారు కదా .. పెట్టండి. ఎవరు ఏం చేసినా, ఎవరెంత అడ్డుపడిన నా రూపం నేను పెట్టించుకుంటాను. తప్పని సరిగా నా రూపాన్ని నేను నిలబెట్టుకుంటా.  బోనాలు సంతోషంగా ఘనంగా అందుకున్నాను. పిల్లలకు, గర్భిణులకు ఏం ఇబ్బంది రానివ్వను. అందరినీ సంతోషంగా ఆనందంగా వుండేలా చూసుకుంటాను అని మాతంగా స్వర్ణలత చెప్పారు.

 

 గత 25 ఏళ్లుగా మాతంగి రంగం వినిపిస్తున్నారు. అంతకు ముందు స్వర్ణలత వారి పూర్వీకులు ఈ భవిష్యవాణి వినిపించేవారట. ఇది తరతరాలుగా వస్తోంది. అమ్మవారిని తలచుకుని పచ్చికుండపై నిలబడి ఈ దేశభవిష్యత్తు గురించిన భవిష్యత్తు చెబుతారు.