ODI World Cup 2023: ధోని శిష్యుడికి గాయం.. వరల్డ్ కప్ నుండి ఔట్

వరల్డ్ కప్ లో శ్రీలంకకు వరుస పరాజయాలకు తోడు వరుస గాయాలు వెంటాడుతున్నాయి. దాదాపు అరడజను ప్లేయర్లు గాయాల భారిన పడడడం ఆ జట్టును మానసికంగా కుంగదీసింది. తాజాగా ఈ లిస్టులో స్పీడ్ స్టార్ మహీశా పతిరానా కూడా చేరిపోయినట్టు సమాచారం. ప్రస్తుతం పతిరానా భజం గాయంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే ఈ  యువ సంచలనం ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ తో జరిగిన చివరి రెండు మ్యాచులకు దూరమయ్యాడు. 

పతిరానా భుజంగాయం నుండి ఇంకా కోలుకోకపోవడంతో వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పతిరానా స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది. దీంతో అసలే కష్టాల్లో ఉన్న శ్రీలంక జట్టుకు పతిరానా గాయం షాక్ కు గురి చేసింది.  కాగా .. ఈ వరల్డ్ కప్ లో పతిరానా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. ఐపీఎల్ లో ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడిన పతిరానా మహీ సమక్షంలో బాగా బౌలింగ్ చేసి జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. 

వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచుల్లో బాగా బౌలింగ్ చేసిన ఈ యువ పేసర్.. ప్రధాన టోర్నీలో మాత్రం తేలిపోయాడు. పాకిస్థాన్, దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్ లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ మెగా టోర్నీకి ముందు స్థార్ స్పిన్నర్ హసరంగా, స్పీడ్ బౌలర్ చమీర, మధుశంక గాయపడగా.. వరల్డ్ కప్ లో కెప్టెన్ శనక గాయపడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 26న డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌తో  శ్రీలంక తన తదుపరి మ్యాచ్ ఆడాల్సి ఉంది.  

ALSO READ :- బంగ్లాదేశ్ లో రెండు రైళ్లు ఢీకొన్నాయి : 20 మంది మృతి, 100 మందికి గాయాలు