ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు యువ సంచలనం మతీషా పతిరాన గాయం నుంచి కోలుకొని చెన్నై చేరుకున్నాడు. ఈ విషయాన్ని పతిరాన మేనేజర్ అమిలా కలుగలగే అధికారికంగా ధృవీకరించారు. త్వరలో ఈ లంక పేసర్ CSK జట్టులో చేరాతాడని అతను తెలిపాడు. శ్రీలంకతో రెండో టీ20 సమయంలో పతిరానా హార్మ్ స్ట్రింగ్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ ఈ క్రమంలో అతను నిన్న (మార్చి 22) రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు.
పతిరానా స్థానంలో బంగ్లాదేశ్ యార్కర్ల వీరుడు ముస్తాఫిజుర్ రెహమాన్ తొలి మ్యాచ్ లోనే చోటు దక్కించుకొని అదరగొట్టాడు. అతను కోలుకోవడానికి కొన్నివారాల సమయం పడుతుందని.. మొదటి నాలుగు మ్యాచ్ లకు మిస్ అయ్యే ఛాన్స్ ఉందని నివేదికలు తెలిపాయి. అయితే పతిరానా చాలా వేగంగా కోలుకొని చెన్నై జట్టులో చేరనున్నాడు. 2023 సీజన్ లో ఈ శ్రీలంక స్పీడ్ స్టార్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ సీజన్ లో మొత్తం 12 మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టి చెన్నై టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.
Also Read:బెంగళూరు వన్ డైమెన్షనల్ వ్యూహం నిరాశపర్చింది
తొలి మ్యాచ్ లో గెలిచి ఊపు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్ ను మార్చి 26న గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ లో పతిరానా ఆడేది అనుమానంగానే కనిపిస్తుంది. పతిరానా స్థానంలో వచ్చిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
Matheesha Pathirana On His Way To Join CSK 🤩💫. pic.twitter.com/wGC4HGoq1l
— Aufridi Chumtya (@ShuhidAufridi) March 23, 2024