వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజినీ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘మట్కా’. నవంబర్ 14న సినిమా విడుదల కానుంది. శనివారం సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ వింటేజ్ లుక్‌లో డిఫరెంట్ గెటప్స్‌తో ఆకట్టుకున్నాడు.
మార్కెట్ కూలీ నుంచి మట్కా కింగ్‌గా ఎదిగిన వాసు జర్నీని ఇందులో చూపించబోతున్నట్టు ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘నేను మాస్ సినిమా చేసి కొంచెం గ్యాప్ వచ్చింది. ఇది ఫ్యాన్స్ అందర్నీ హ్యాపీ చేసే సినిమా అవుతుంది. ఆడియెన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడానికి టీమ్ అంతా ప్యాషన్‌తో వర్క్ చేశాం’ అని చెప్పాడు.
ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశానంది మీనాక్షి చౌదరి. డైరెక్టర్ కరుణ్ కుమార్ మాట్లాడుతూ ‘మెగా అభిమానులందరికీ నా ప్రామిస్. వరుణ్ తేజ్‌ని ఎలా చూద్దామనుకుంటున్నారో అలాగే ఈ సినిమా ఉంటుంది. ఆయనలో ఉన్న నటుడు, ఆయనలోని యాక్షన్ హీరో..అన్ని కోణాల్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. 40 ఏళ్ల క్రితం జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దీన్ని రూపొందిం చాం’ అని చెప్పాడు. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నామని నిర్మాతలు రజినీ తాళ్లూరి, విజయేందర్ రెడ్డి చెప్పారు.