చివరి దశ చిత్రీకరణలో మట్కా మూవీ

చివరి దశ చిత్రీకరణలో మట్కా మూవీ

వరుణ్ తేజ్ హీరోగా  కరుణ కుమార్ దర్శకత్వంలో  డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘మట్కా’. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీలో ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది.  ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో  రూపొందుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన  ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 

ఓవైపు షూటింగ్ కంప్లీట్ చేస్తూనే.. మరోవైపు  పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఎక్సయిటింగ్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ను అందిస్తామని చెప్పారు.  మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  జీవీ ప్రకాష్ కుమార్  సంగీతం అందిస్తున్నాడు.