
హనుమకొండ, వెలుగు: హనుమకొండలోని మెడికవర్ హాస్పిటల్లో డెలివరీల కోసం మాతృదేవోభవ ప్యాకేజీని అందిస్తున్నట్లు కన్సల్టెంట్ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ డా.మౌనిక రాజ్ సైనీ, గైనకాలజిస్ట్ డా. అమతుల్ హఫ్సా తెలిపారు. ఈ మేరకు శనివారం హాస్పిటల్లో ఈ కొత్త ప్యాకేజీని ప్రారంభించారు.
గర్భధారణ నుంచి ప్రసవం వరకు తొమ్మిది నెలలపాటు మాతృదేవోభవ ప్యాకేజీ కింద గైనకాలజిస్ట్ కన్సల్టేషన్సేవలందిస్తామన్నారు. నార్మల్డెలివరీ సేవలు రూ.25 వేలు, సీ సెక్షన్ రూ.35 వేలు గర్భిణి పరిస్థితిని బట్టి ఉంటాయన్నారు. ఈ ప్యాకేజీని గర్భిణులు వినియోగించుకోవాలని సూచించారు.