IND vs NZ: 27 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలి బౌలర్‌.. అక్తర్ రికార్డు బద్దలు కొట్టిన హెన్రీ

IND vs NZ: 27 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలి బౌలర్‌.. అక్తర్ రికార్డు బద్దలు కొట్టిన హెన్రీ

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 5 వికెట్లతో సత్తా చాటిన కివీస్ స్పీడ్ గన్.. 27 ఏళ్ల ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్‌పై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేరిట ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డును హెన్రీ బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌కు ముందు 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ పేసర్లు నవీద్-ఉల్-హసన్, షోయబ్ అక్తర్ ఇద్దరూ భారత్‌పై 4 వికెట్లు పడగొట్టారు. ఆ రికార్డు ఇప్పుడు బద్దలైంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు

  • మాట్ హెన్రీ (NZ): 5/42 (దుబాయ్, 2025)
  • నవేద్-ఉల్-హసన్ (PAK): 4/25 (బర్మింగ్‌హామ్, 2004)
  • షోయబ్ అక్తర్ (PAK): 4/36 (బర్మింగ్‌హామ్, 2004)
  • డగ్లస్ హోండో (ZIM): 4/62 (కొలంబో, 2002)

హెన్రీ(5 వికెట్లు) విజృంభించడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ చేధించకపోవడం గమనార్హం. ఛేదనలో 45.3 ఓవర్లలో 205 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. దాంతో, టీమిండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించి.. టేబుల్ టాపర్‌గా నిలిచింది.