Champions Trophy 2025: టీమిండియాకు గుడ్ న్యూస్.. గాయంతో ఫైనల్ మ్యాచ్‌కు హెన్రీ ఔట్!

Champions Trophy 2025: టీమిండియాకు గుడ్ న్యూస్.. గాయంతో ఫైనల్ మ్యాచ్‌కు హెన్రీ ఔట్!

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ బిగ్ షాక్ తగలనుంది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ గాయం కారణంగా భారత్ తో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు అనుమానంగా మారింది. వస్తున్న నివేదికల ప్రకారం హెన్రీ ఫైనల్ ఆడడం దాదాపుగా అసాధ్యంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కివీస్ బౌలర్ భుజం గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. అతని గాయంపై శుక్రవారం (మార్చి 7) న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ బౌలర్ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. తనకి ఫిట్‌నెస్ స్థితి ఇంకా తెలియదని చెప్పాడు. హెన్రీ అప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి తొందరపడం. ఫైనల్ కు అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నాం. అని గ్యారీ స్టీడ్ చెప్పాడు. 

ఫైనల్ మ్యాచ్ కు మరో రోజు మాత్రమే సమయం ఉంది. ఈ లోపు హెన్రీ కోలుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. లాహోర్ వేదికగా బుధవారం(మార్చి 5) సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో హెన్రీ గాయపడ్డాడు. హెన్రిచ్ క్లాసెన్‌ను క్యాచ్ పట్టడానికి డైవ్ చేసిన ఈ కివీస్ పేసర్ భుజానికి గాయమైంది. కాసేపు గ్రౌండ్ లో ఇబ్బందిపడ్డారు. హెన్రీ త్వరగా కోలుకుని ఇండియాతో జరిగే ఫైనల్ మ్యాచ్ కు అందుబాటులో ఉండాలని మరో అద్భుత ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తోంది. హెన్రీ మ్యాచ్ సమయానికి కోలుకోపోతే అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీకి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో మాట్ హెన్రీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 16.70 యావరేజ్ తో 10 వికెట్లు పడగొట్టి టోర్నీ టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో సత్తా చాటి 27 ఏళ్ల ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్‌పై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేరిట ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డును హెన్రీ బద్దలు కొట్టాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ తుది సమరానికి భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఆదివారం (మార్చి 9) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇదే గ్రూప్ దశలో ఆడిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. భారత్, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడడం ఇది రెండోసారి. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. 

ALSO READ : Champions Trophy 2025: కోహ్లీకే ఛాన్స్.. గోల్డెన్ బ్యాట్ రేస్‌లో ఆరుగురు క్రికెటర్లు

ఆదివారం జరగబోయే ఫైనల్లో భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటే.. ఐసీసీ టోర్నీల్లో భారత్ పై అద్భుతమైన రికార్డ్ ఉన్న కివీస్ టీమిండియాకు షాక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇరు జట్లు బలంగా కనిపిస్తుండడంతో ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 2:30  ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌–18, జియో హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌ ప్రసారమవుతుంది.