
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గ్రాండ్ గా ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. పిచ్ మొదట బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని కివీస్ కెప్టెన్ సాంట్నర్ చెప్పాడు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయం కారణంగా మ్యాట్ హెన్రీ ఫైనల్ కు మ్యాచ్ కు దూరమయ్యాడు. ఫైనల్ సమయానికి పూర్తి ఫిట్ నెస్ సాధిస్తాడనున్నా అది సాధ్యపడలేదు. దీంతో హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్ తుది జట్టులోకి వచ్చాడు.
ALSO READ | IND vs NZ Final: కుల్దీప్ మాయాజాలం.. న్యూజిలాండ్ డేంజరస్ బ్యాటర్లు ఔట్
ఫైనల్ లో ఆడలేకపోయినందుకు హెన్రీ తీవ్ర నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ కు ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. న్యూజిలాండ్ హెడ్ కోచ్ అతన్ని ఓదారుస్తున్నారు. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో మాట్ హెన్రీ నాలుగు మ్యాచ్‌ల్లో 16.70 యావరేజ్ తో 10 వికెట్లు పడగొట్టి టోర్నీ టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో సత్తా చాటాడు. ఫైనల్లో భారత్ పై అద్భుత రికార్డ్ ఉన్న హెన్రీ లేకపోవడం న్యూజిలాండ్ మైనస్ గా మారింది.
లాహోర్ వేదికగా బుధవారం(మార్చి 5) సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో హెన్రీ గాయపడ్డాడు. హెన్రిచ్ క్లాసెన్‌ను క్యాచ్ పట్టడానికి డైవ్ చేసిన ఈ కివీస్ పేసర్ భుజానికి గాయమైంది. కాసేపు గ్రౌండ్ లో ఇబ్బందిపడ్డారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం న్యూజిలాండ్ 25 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజ్ లో డారిల్ మిచెల్ (25), గ్లెన్ ఫిలిప్స్ (3) ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, జడేజాలకు తలో వికెట్ లభించింది.
Matt Henry was emotional after failing in the Champions Trophy final 💔🥺
— Cricket Gyan (@cricketgyann) March 9, 2025
.
.
📷 JioHotstar
. #INDvsNZ #ChampionsTrophy2025 #matthenry #injury #explorecricket #explorepage #cricketupdates #cricketnews #cricketgyan pic.twitter.com/Ifgp6VUxv2