- మట్ట రాఘమయి, దయానంద్ పూజలు
సత్తుపల్లి, వెలుగు : మండల పరిధిలోని కిష్టారం సత్తెమ్మ తల్లి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ నేతలు డాక్టర్ మట్ట దయానంద్, రాఘమయి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబ పాలన నుంచి విముక్తి పొందితే తప్ప సుభిక్షంగా ఉండదన్నారు.
అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యపడుతుందని, సత్తుపల్లిని సల్లంగా చూడు సత్తేమ్మ తల్లి అని వారు మొక్కుకున్నారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు నరుకుళ్ల అప్పారావు, మోరిశేట్టి సాంబశివరావు, బత్తుల భరత్, వంగరి రాకేశ్, మల్లూరు దిలీప్ ఉన్నారు.
ALSO READ : కాళేశ్వరం, కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి : వైఎస్షర్మిల