నీలాద్రి అభివృద్ధికి కృషి చేస్తా : మట్టా రాగమయి దయానంద్​

పెనుబల్లి, వెలుగు  :  నీలాద్రి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ చెప్పారు. పెనుబల్లి మండలంలోని నీలాద్రి అడవుల్లో ఉన్న నీలాద్రి ఆలయాన్ని ఆమె సోమవారం సందర్శించారు. ఆలయ ఈఓ పాకాల వెంకటరమణ ఎమ్మెల్యే దంపతులకు ఘ నస్వాగతం పలికారు.  కార్తీక సోమవారం సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారి కల్యాణం చూసి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, నున్న రామకృష్ణ, మండల నాయకులు బొర్రా కోటేశ్వరావు, షేక్ కరీముల్లా, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజలరాణి, ఆలుగోజు చిన్న స్వామి, చీకటి రామారావు తదితరులు పాల్గొన్నారు.

స్టూడెంట్స్​తో కలిసి టిఫిన్​

సత్తుపల్లి, వెలుగు :  పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఎమ్మెల్యే రాగమయి  దయానంద్ సోమవారం స్టూడెంట్స్​తో కలిసి టిఫిన్ చేశారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించారు.  సౌకర్యాలపై స్టూడెంట్స్​ను అడిగి తెలుసుకున్నారు. 

కార్మికుల సమస్యలపై ఆరా.. 

స్థానిక మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులతో తన కాంప్​ కార్యాలయంలో ఎమ్మెల్యే రాగమయి సోమవారం సమవేశమై సమస్యలపై ఆరా తీశారు. ఉద్యోగ భద్రత అంశంపై మున్సిపల్ కార్మికుల పక్షాన అసెంబ్లీలో పోరాడతానని హామీ ఇచ్చారు. గిరిజన బెటాలియన్ కమాండెంట్ పి.వెంకటరాములు, అసిస్టెంట్ కమాండెంట్ ఎం.శ్రీనివాసరావు ఆర్ఐఎం సతీశ్, ఆర్ఎస్ఐ నాగేశ్వరరావు ఎమ్మెల్యే రాగమయిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలరాణి, కౌన్సిలర్లు గ్రాండ్ మౌలాలి, దూదిపాల్ల రాంబాబు మందపాటి పద్మజ్యోతి, నాయకులు చల్లగుల్ల నరసింహారావు, వినుకొండ కృష్ణ, బొంతు శ్రీనివాసరావు, కమల్ పాషా  పాల్గొన్నారు.