గద్వాల, వెలుగు: రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని కలిపి ప్రజలకు అంటగడుతున్నారనే విషయం గురువారం గట్టు మండలంలో కలకలం సృష్టించింది. తీరా అవి ప్లాస్టిక్ బియ్యం కాదని ఫోర్టిఫైడ్ రైస్ (పౌష్టికాహార బియ్యం) అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల నుంచి రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్‌ను కలిపి సరఫరా చేస్తున్నారు. వాటిని ప్లాస్టిక్ బియ్యం అనుకొని గొర్లఖాన్ దొడ్డి విలేజ్ లో కొందరు లీడర్లు గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి హంగామా చేశారు.
కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం జూలై నుంచి రేషన్ బియ్యం, అంగన్ వాడీలకు పంపిణీ చేసే బియ్యం, మిడే మిల్స్ లో క్వింటాల్ కు ఒక కేజీ ఫోర్టిఫైడ్ రైస్‌ను కలిపి ఇవ్వాలి. ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్స్ సమృద్ధిగా అందుతాయనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తీసుకు వచ్చిందని డీఎస్ఓ రేవతి తెలిపారు.