NZ vs SA: చరిత్రలో ఒకే ఒక్కడు.. అరంగేట్ర వన్డేలోనే సఫారీ బ్యాటర్ ప్రపంచ రికార్డు

NZ vs SA: చరిత్రలో ఒకే ఒక్కడు.. అరంగేట్ర వన్డేలోనే సఫారీ బ్యాటర్ ప్రపంచ రికార్డు

సౌతాఫ్రికా యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే అరంగేట్ర వన్డేను ఘనంగా చాటుకున్నాడు. ఆడుతున్న తొలి వన్దే మ్యాచ్ లోనే పటిష్టమైన  న్యూజిలాండ్ బౌలింగ్ ను అలవోకగా ఆడేస్తూ భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. పాకిస్తాన్ లో ట్రై-సిరీస్‌లో భాగంగా సోమవారం (ఫిబ్రవరి 10) న్యూజిలాండ్‌తో  జరుగుతున్న మ్యాచ్ లో  బ్రీట్జ్కే ఈ ఘనతను అందుకున్నాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 148 బంతుల్లో 150 పరుగులు చేసి ఏకంగా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇన్నింగ్స్‌ 41వ ఓవర్‌లో 128 బంతుల్లో ఈ 26 ఏళ్ల సఫారీ బ్యాటర్ ఈ మైలురాయిని అందుకున్నాడు.

ఆడుతున్న తొలి వన్డే మ్యాచ్ లోనే 150 పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ వెస్టిండీస్ కు చెందిన హేన్స్ పేరిట ఉంది. ఈ వెస్టిండీస్ క్రికెటర్ అరంగేట్ర వన్డేలో 148 పరుగులు చేసి నిన్నటివరకు టాప్ లో ఉన్నాడు. అంతేకాదు డెబ్యూ వన్డేలోనే సెంచరీ బాదిన నాలుగో సౌతాఫ్రికా క్రికెటర్ గా బ్రీట్జ్కే చరిత్ర సృష్టించాడు. కొలిన్ ఇంగ్రామ్, టెంబా బావుమా, రీజా హెండ్రిక్స్ ఈ లిస్టులో బ్రీట్జ్కే కంటే ముందున్నారు. 

Also Read :- ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ దూరం

బ్రీట్జ్కే సెంచరీతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. బ్రీట్జ్కే 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 148 బంతుల్లో 150 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాసన్ స్మిత్ (41) తో కలిసి రెండో వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యంతో 68 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మల్డర్ (64) తో కలిసి 131 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ, విలియం ఓరూర్కే తలో రెండు వికెట్లు పడగొట్టారు. బ్రేస్ వెల్ కు ఒక వికెట్ దక్కింది.