Rishabh Pant: పంత్‌ను చూసి గర్విస్తున్నాను: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ కూతురు

Rishabh Pant: పంత్‌ను చూసి గర్విస్తున్నాను: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ కూతురు

బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆట వర్షం కారణంగా జరగలేదు. మ్యాచ్ మొదటి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. తొలి సెషన్ లో మాత్రమే మ్యాచ్ జరగగా.. రెండు, మూడు సెషన్స్ పూర్తిగా వర్షం కారణంగా తుడిచిపెట్టుకొని పోయాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ కుమార్తె.. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై ప్రశంసలు కురిపించింది. పంత్ అంటే తనకు గౌరవం ఉందని.. అతని జీవితం స్ఫూర్తిదాయకం అని ప్రశంసించింది. 

హేడెన్ కుమార్తె మాట్లాడుతూ.."పంత్  పునరాగమనం సంచలనం. ఇటీవలే అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలవడం చూశాం. అతను ప్రమాదం నుంచి కోలుకొని టీమిండియాలోకి కంబ్యాక్ ఇవ్వడం అద్భుతం. నేను ఆస్ట్రేలియన్‌ని, కానీ నేను అతడిని చూసి గర్వపడుతున్నాను. అతనికి నేను పెద్ద అభిమానిని. పంత్ దృఢ సంకల్పం నమ్మశక్యం కానీ రీతిలో ఉంది". అని ఆమె పంత్ పై పొగడ్తలు కురిపించింది. 

Also Read : NZ vs ENG: సిక్సర్లతో గేల్ రికార్డ్ సమం చేసిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్

కారు ప్రమాదంలో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ యువ వికెట్ కీపర్.. రీ ఎంట్రీలో తన తొలి టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో సత్తా చాటాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 124 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతూ బిజీగా ఉన్నాడు.

ఐపీఎల్ చరిత్రలో రిషబ్ పంత్ కు కనీ వినీ ఎరుగని ధర లభించింది. వేలానికి ముందు ఖచ్చితంగా భారీ ధర పలుకుతాడని ఆశించిన అతనిపై కోట్ల వర్షం కురిసింది. ఇటీవలే 2024 మెగా వేలంలో రూ. 27 కోట్ల రూపాయలకు రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జయింట్స్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం విశేషం.