IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. తొలి మ్యాచ్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ దూరం

IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. తొలి మ్యాచ్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ దూరం

ఐపీఎల్ 2024 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు గాయాలు వెంటాడుతున్నాయి. హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్ జట్టుతో కలవగా యంగ్ స్టార్ గిల్ కు గుజరాత్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి ఆ జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ 2024 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మరోవైపు వరల్డ్ బెస్ట్ స్పిన్నర్ గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి. వీటికి తోడు తాజాగా ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదు.

మార్చి 21 నుండి 25 వరకు టాస్మానియాతో షెఫీల్ షీల్డ్ ఫైనల్ జరగనుంది. ఆసీస్ డొమెస్టిక్ టోర్నీలో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీ. దీంతో వేడ్ ఈ మ్యాచ్ పై ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ కారణంగానే ఐపీఎల్ తొలి మ్యాచ్ కు దూరం కానున్నాడు. మార్చి 25న గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ తో ఆడనుంది. మార్చి 27న చెన్నై సూపర్ కింగ్స్ తో జరగబోయే రెండో మ్యాచ్ కు ఈ ఆసీస్ వికెట్ కీపర్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

వేడ్ మిచెల్ మార్ష్ గైర్హాజరీలో 2023 డిసెంబర్ లో భారత్ లో జరిగిన 5 టీ20 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 36 ఏళ్ల ఈ ఆసీస్ స్టార్.. 2011 తర్వాత 2022 ఎడిషన్‌కు గుజరాత్ జట్టులో చేరాడు. అయితే వేడ్ ఐపీఎల్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఇప్పటివరకు ఆడిన 15 మ్యాచ్‌లలో 15.70 యావరేజ్ 157 పరుగులు మాత్రమే చేశాడు.