మట్టి కథ మూవీ రివ్యూ : తెలంగాణ పల్లె జీవితాన్ని ఒడిసి పట్టిన కథ

మట్టి కథ మూవీ రివ్యూ : తెలంగాణ పల్లె జీవితాన్ని ఒడిసి పట్టిన కథ

అజయ్ వేద్(Ajay vedh), మాయ(Maya), కనకవ్వ(Kanakavva), దయానంద్ రెడ్డి(Dayanand reddy), బలగం సుధాకర్ రెడ్డి(Balagam sudakar reddy) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా మట్టి కథ(Mattikatha). మైక్ మూవీస్(Mic movies) బ్యానర్ పై అప్పిరెడ్డి(Appi reddy) నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. సతీశ్ మంజీర(Sathish manjeera) సహనిర్మాతగా వ్యవహరించారు. పవన్ కడియాల(Pawan kadiyala) దర్శకత్వం వహించగా.. క్రియేటివ్ హెడ్ గా జీహెచ్ సుందర్ పర్యవేక్షించిన.. మట్టి కథ సినిమా.. సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? నటీనటులు ఎలా చేశారు? ప్రేక్షకులు ఈ సినిమా గురించే ఇస్తున్న రివ్యూ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 

కథ:
ఇటీవల తెలంగాణ కథాంశంగా వచ్చిన ఎన్నో కథల్లో హింస, కొట్లాటలు, తాగుడు వంటి అంశాలతో సాగిన ధోరణికి.. విభిన్నంగా ఉంది మట్టి కథ సినిమా. తెలంగాణ యాస, భాష ఎంత మధురంగా ఉంటుంది.. ఎంత చక్కగా ఉంటుందో మట్టి కథ మనసులకు హత్తుకుంటుంది. తెలంగాణ పల్లెల్లోని మనుషుల జీవితాన్ని సహజ సిద్ధంగా తెరకెక్కించటంతో విజయవంతం అయ్యారు దర్శకుడు పవన్ కడియాల. భూమయ్య, రాజు, శ్రీను, యాదగిరి అనే నాలుగు యువకులు ఓ గ్రామంలో ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు తమ జీవితాన్ని సీరియస్ గా తీసుకోరు. తమ కుటుంబాల్లో జరిగిన సంఘటనలు కూడా పట్టించుకోకుండా జీవితాన్ని సరదాగా గడుపుతూ ఉంటారు. అలా సాగుతున్న వాళ్ళ జీవితంలో.. పరీక్షల్లో కాపీ కొట్టడంతో దొరికిపోతారు. ఆ ఎగ్జామ్ కు ఇన్విజిలేటర్ గా వచ్చిన వ్యక్తితో ఆ ముగ్గురికి గతంలో గొడవలు ఉండటంతో.. అది వారి జీవితంలో అనుకోని మార్పులను తీసుకొస్తుంది. పోలీసుల ప్రమేయంతో పరిస్థితి అదుపు తప్పుతుంది. మరి చిరవికి ఏమైంది అనేది మిగిలిన కథ. 

విశ్లేషణ:

సినిమాలో హీరోగా చేసిన అజయ్ వేద్ నటన.. సహజత్వానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. అచ్చం పల్లెటూరి అబ్బాయి ఎలా ఉంటాడు.. ఎలా ఆలోచిస్తాడు.. ఎలా పనులు చేస్తుంటాడు.. ఎంత అమాయకత్వంగా ఉంటాడు అనేది తన నటనతో కట్టి పడేస్తాడు. అజయ్ దేవ్ కు ఇది మొదటి సినిమా అయినా.. ఎంతో అనుభవం ఉన్న నటుడిగా నిరూపించుకున్నాడు. మట్టి కథ సినిమా 2 వేల సంవత్సరంలో జరుగుతుంది. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం లేని కాలంలో మనుషుల జీవితాలు ఎలా ఉండేవి అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు. కీలక పాత్రల్లో నటించిన నలుగురు యువకుల జీవితంతో కథ మొదలై.. వారి కాలేజీ జీవితం వంటి సీన్స్ సరదాగా సాగిపోతాయి. గ్రామల్లోని మనుషుల అమాయకత్వం, భూమిపై వారికుండే ప్రేమ, గ్రామాల్లోని రాజకీయాలు వంటి అంశాలను ఎంతో సున్నితంగా తెరకెక్కించింది చిత్ర యూనిట్. పల్లెల్లోని మట్టి వాసన.. అక్కడి మనుషుల మంచితనాన్ని తెరపై అద్భుతంగా చూపించారు దర్శకుడు దర్శకుడు పవన్ కడియాల.

మట్టికథలో చాలా వరకు సహజత్వానికి దగ్గరగా ఉండే సన్నివేశాలే కనిపిస్తాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకులు.. కథకు ఇట్టే కనెక్ట్ అవుతారు. బోమయ్య పాత్ర సిగరెట్ తాగడం నేర్చుకోవటం.. సిటీ నుంచి వచ్చిన శేఖర్ గ్రామస్తులకు మొబైల్‌ ఫోన్ పరిచయం చేయడం వంటి సీన్స్.. సరదాగా, సహజంగా అనిపిస్తాయి. ఎలాంటి సన్నివేశాలు చూపిస్తూనే..  గ్రామాల్లోని పాఠశాలల్లో అమ్మాయిలపై లైంగిక వేధింపులు, పోలీసుల అవినీతి, గ్రామ పెద్దల అవకాశవాదం, రైతుల దుర్బల జీవితాలు, జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లడం వంటి చాలా అంశాలు ప్రేక్షకుల గుండెలను టచ్ చేస్తాయి. 

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మట్టి కథ సినిమాకు ప్రధాన బలం కెమెరా వర్క్ , సంగీతం అని చెప్పాలి. సాయినాథ్ అందించిన సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యింది.  పెల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా తన కెమెరాలో బంధించారు. ఇక స్మరన్ సాయి సంగీతం సినిమాకు మంచి టాక్ తీసుకొచ్చింది. 

మట్టి కథ సినిమా.. ఓవరాల్ గా ఎలా ఉంది అంటే.. మనుషులకు కనెక్ట్ అయ్యే మూవీ అనొచ్చు.. ఇటీవల కాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో.. గుర్తుండిపోయే సినిమాల్లో మట్టి కథ ఒకటిగా నిలిచిపోతుందనటంలో సందేహం లేదు..