హైదరాబాద్, వెలుగు : పరుపులు తయారు చేసే సీలి హైదరాబాద్‌కు సమీపంలోని మేడ్చల్ జిల్లా గోసాయిగూడ గ్రామంలో తమ మొదటి తయారీ సదుపాయాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ ఆధునిక ఫ్యాక్టరీ 40 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటుందని తెలిపింది. హై-గ్రోత్ ఇంటర్నేషనల్ మార్కెట్లలో విస్తరించాలన్న లక్ష్యంతో దీనిని నిర్మించామని ప్రకటించింది.
“మా గ్లోబల్ బ్రాండ్ 1881లో టెక్సస్ రాష్ట్రంలోని సీలి అనే చిన్న పట్టణంలో ప్రారంభమైంది. గత 143 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం సీలి బ్రాండ్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, సింగపూర్, తైవాన్ సహా అనేక దేశాలలో వ్యాపారం చేస్తున్నాయి. సీలి పరుపులు వెన్నెముకకు సపోర్ట్ అందిస్తాయి”అని కంపెనీ తెలిపింది.