
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 47 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్- కమ్- డైరెక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ - కమ్ - డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ - కమ్ - అసిస్టెంట్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, లెక్చరర్
విభాగాలు: ఎడ్యుకేషన్, అరబిక్, హిందీ, ఉమెన్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, జువాలజీ, బోటనీ, ఫిజిక్స్, సోషల్ వర్క్, సోషియాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు జూన్ 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. వివరాలకు www.manuu.edu.in వెబ్సైట్లో సంప్రదించాలి.