ములుగు అడవిలో మావోయిస్టుల డంప్​ లభ్యం

  • 3 తుపాకులు, మందు గుండు సామగ్రి స్వాధీనం
  • ములుగులో మీడియాకు ఎస్పీ శబరీశ్​ వెల్లడి

ములుగు, వెలుగు : మావోయిస్టుల ఆయుధ డంపును​ములుగు జిల్లా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం జిల్లా ఎస్పీ పి.శబరీశ్​మీడియాకు తెలిపారు. తాడ్వాయి మండలం బంధాల అటవీ ప్రాంతంలోని ఒడ్డుగూడెం పరిధి వెట్టెవాగు వద్ద మావోయిస్టుల ఆయుధాల డంపు ఉందని పోలీసులకు సమాచారం అందింది.

ఉదయం 11గంటలకు పోలీసులు, బీడీ టీమ్ లు వెళ్లి సోదాలు చేయగా.. మూడు తుపాకులు, 165 రౌండ్ల బుల్లెట్లు, 2 బోర్​క్యాట్రిడేజ్​లు, ఎస్ఎల్ఆర్​ మ్యాగజైన్స్​2, మ్యాగజైన్​పౌచెస్​4  లభించాయి. మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయావాలని ఎస్పీ శబరీశ్ కోరారు. లొంగిన వారికి ప్రభుత్వ పునరావాసం కల్పిస్తుందని పేర్కొన్నారు. డీఎస్పీ ఎన్​.రవీందర్, తాడ్వాయి సీఐ జి.రవీందర్​, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు