ఇన్‌‌‌‌ఫార్మర్‌‌‌‌ పేరుతో వ్యక్తి హత్య

ఇన్‌‌‌‌ఫార్మర్‌‌‌‌ పేరుతో వ్యక్తి హత్య

భద్రాచలం, వెలుగు : ఇన్‌‌‌‌ఫార్మర్‌‌‌‌ పేరుతో మావోయిస్టులు ఓ వ్యక్తిని హత్య చేశారు. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గాదిరాజ్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌ పరిధిలోని ముటేలి గ్రామానికి చెందిన దిర్దో లచ్చు శనివారం ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఈ టైంలో కొందరు సాయుధ మావోయిస్ట్‌‌‌‌లు అతడి ఇంటికి వచ్చి మాట్లాడే పని ఉందంటూ తీసుకెళ్లారు. గ్రామ శివార్లలోకి వెళ్లిన తర్వాత పోలీసులకు ఇన్‌‌‌‌ఫార్మర్‌‌‌‌గా పనిచేస్తున్నావంటూ గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనతో ముటేలీ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.