- ఆమెతో పాటు మరో 10 మంది..
భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల తారక్క బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ఎదుట లొంగిపోయారు. ఆమెతో పాటు మరో 10 మంది మావోయిస్టులు కూడా సరెండర్ అయ్యారు. తారక్కపై నాలుగు రాష్ట్రాల్లో 170కిపైగా కేసులు ఉన్నాయి.
లొంగిపోయిన వారిలో డివిజన్ కమిటీ మెంబర్స్ సురేశ్, కల్పన, అర్జున్, ఏరియా కమిటీ మెంబర్స్ వనిత, సమ్మి, డిప్యూటీ కమాండర్ నిషా, ఎల్‌వోఎస్ మెంబర్స్ శృతి, శశికళ, ఆకాశ్ సోమా, సోనీ సుక్కు ఉన్నారు. వీరందరిపై కలిపి రూ.1.03 కోట్ల మేర రివార్డులు ఉన్నాయి. కాగా తారక్క మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్యగా పోలీసులు చెబుతున్నారు.