ఐసీయూ నుంచి ప్రైవేటు రూంకు రిషబ్ పంత్

ఐసీయూ నుంచి ప్రైవేటు రూంకు రిషబ్ పంత్

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పంత్ను ప్రైవేటు గదికి తరలించారు. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించేందుకే ప్రైవేటు గదికి పంత్ ను మార్చినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని..గాయాల నుంచి త్వరగా కోలుకుంటున్నాని వెల్లడించారు. మరోవైపు మోకాలిలో లిగమెంట్ల చికిత్స కోసం పంత్ను విదేశాలకు పంపించడంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. 

న్యూ ఇయర్ను తల్లితో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో  రిషభ్‌ పంత్‌   కారు డివైడర్‌ను ఢీ కొట్టింది.  ప్రమాదంతో కారులో  మంటలు చెలరేగడంతో..అదాన్ని పగులకొట్టి  పంత్‌ కిందికి దూకేశాడు. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్‌ నుదురుపై రెండు గాట్లు అయ్యాయి.  కుడి మోకాలిలోని లిగమెంట్లలో చీలిక వచ్చింది. అతడి కుడి చేతి మణికట్టు, కుడి కాలి పాదం, మడమల్లో గాయాలయ్యాయి. వెన్నెముక భాగంలోనూ  గాయాలయ్యాయి. 

పంత్కు ప్రాథమిక చికిత్స తర్వాత డెహ్రాడూన్‌లోని మాక్స్‌ ఆస్పత్రికి తరలించారాు. గాయాల తీవ్రత తెలుసుకొనేందుకు ఎమ్మారై స్కానింగ్‌ కూడా చేశారు. పంత్‌ కుటుంబ సభ్యులు, వైద్య బృందంలోని డాక్టర్లతో బీసీసీఐ నిరంతరం సంప్రదిస్తూనే ఉంది. వైద్యులు అతడికి అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు.