పాకిస్తాన్ కంటే ఇండియాలోనే నిరుద్యోగులు డబుల్: రాహుల్ గాంధీ

పాకిస్తాన్ కంటే ఇండియాలోనే నిరుద్యోగులు డబుల్: రాహుల్ గాంధీ

దేశంలో గత 40 సంత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా.. బీజేపీ పాలనలో ఈరోజు అత్యధిక నిరుద్యోగం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన భారత్ న్యాయ్ యాత్ర పస్తుతం మధ్య ప్రదేశ్ లో కొనసాగుతోంది. ఈ యాత్రలో  మార్చి 3వ తేదీ ఆదివారం గ్వాలియర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

పాకిస్తాన్‌తో పోలిస్తే భారతదేశంలో నిరుద్యోగం రెండింతలు అయ్యిందని మండిపడ్డారు. పక్క దేశాలు బంగ్లాదేశ్, భూటాన్ లో కంటే మన దగ్గరే ఎక్కువ మంది నిరుద్యోగ యువత ఉందని చెప్పారు. దీనికి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలే కారణం తీవ్రంగా తప్పుబట్టారు. నోట్ల రద్దు, GST అమలు ద్వారా చిన్న వ్యాపార సంస్థల మనుగడ దెబ్బ తినడంతో దేశంలో ఎంతో మంది యువత ఉపాధి కోల్పోయిందని చెప్పారు. అధికారం చేపట్టిన తర్వాత ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ.. యువతను మోసం చేశారని దుయ్యబట్టారు.