
టీ20 విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్లో చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగులో ఎన్నో మ్యాచులను ఒంటి చేత్తో గెలిచిపించిన మ్యాక్సీ.. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు (19) డకౌట్ అయిన ప్లేయర్‌గా చెత్త రికార్డ్ నమోదు చేశాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం (మార్చి 25) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో మ్యాక్స్‌వెల్ (0) ఖాతా తెరకుండానే పెవిలియన్ చేరాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా తన పేరిట చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు.
ALSO READ | GT vs PBKS: శ్రేయస్ అయ్యర్ వీరోచిత ఇన్సింగ్.. గుజరాత్ ముందు భారీ టార్గెట్
ఈ రికార్డ్ ఇప్పటి వరకు టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (18), దినేష్ కార్తీక్ (18), మ్యాక్స్‌వెల్ పేరిట సంయుక్తంగా ఉండేది. గుజరాత్‌తో జరిగిన మ్యాచులో డకౌట్ కావడంతో మ్యాక్స్‌వెల్ (19) ఈ చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మ్యాక్సీ డకౌట్ కావడంతో పంజాబ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు.. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్అయిన ప్లేయర్‌గా మ్యాక్స్ వెల్ చెత్త రికార్డ్ క్రియేట్ చేయడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. అత్యధిక సార్లు డకౌట్ అయిన చెత్త రికార్డ్ మా ప్లేయర్ పేరు మీద లేకుండా మ్యాక్స్‌వెల్ తొలి స్థానంలోకి వచ్చాడని సోషల్ మీడియాలో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సీజన్ తొలి మ్యాచులో పంజాబ్ బ్యాటర్స్ దుమ్మురేపారు. గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (97) వీరోచిత ఇన్సింగ్ ఆడగా.. చివర్లో శశాంక్ సింగ్ (44) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రియాన్ష్ ఆర్య (47), అజ్మతుల్లా ఒమర్జాయ్ 16, మార్కస్ స్టోయినిస్ 20 రన్స్ చేశారు. గుజరాత్ బౌలర్లో సాయి కిశోర్ 3 వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్, రబాడ చెరో వికెట్ తీశారు.