
- జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి
సంగారెడ్డి టౌన్ ,వెలుగు : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఈనెల 13న ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినాన్ని ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. అన్ని ప్రభుత్వ సంస్థలకు, పరిశ్రమలకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారని వెల్లడించారు.