మే 5న రాష్ట్రానికి నితిన్​ గడ్కరీ..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఓపెనింగ్

మే  5న రాష్ట్రానికి నితిన్​ గడ్కరీ..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఓపెనింగ్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వచ్చే నెల 5న రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఓపెనింగ్ చేయనున్నారు. గోల్నాక, చే నెంబర్ మధ్య నిర్మించిన ఫ్లైఓవర్, బీహెచ్‌‌‌‌ఈఎల్ దగ్గర నిర్మించిన ఫ్లైఓవర్, ఆరాంఘర్–శంషాబాద్ మధ్య హైవే విస్తరణ, శంషాబాద్‌‌‌‌లో ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌ను గడ్కరీ ఓపెనింగ్ చేస్తారని నేషనల్ హైవే అథారిటీ అధికారులు తెలిపారు. 

హైదరాబాద్–విజయవాడ హైవేపై ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్స్ మరమ్మతుల ప్రాజెక్టుకు, గౌరెల్లి నుంచి వలిగొండ, తొర్రూరు, మహబూబాబాద్, కొత్తగూడెం వరకు నిర్మించనున్న హైవేలో భాగంగా గౌరెల్లి నుంచి వలిగొండ వరకు తొలి ప్యాకేజ్ పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. వీటితో పాటు నల్గొండ చుట్టూ రూ.516 కోట్లతో నిర్మించనున్న రింగ్ రోడ్డుకూ శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.