వెలుగు, నెట్వర్క్ : ఉమ్మడి జిల్లాలో బుధవారం మేడే వేడుకలను కార్మిక సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఐన్టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో జెండావిష్కరణలు చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలోని పలు గనులు, డిపార్ట్మెంట్లపై, ప్రధాన వీధుల్లో జెండాలను ఎగురవేసి మేడే జరిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడారు. కుల, మత రాజకీయాలకు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
మేడే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సీఐటీయు శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షులు గుల్ల బాలాజీ ఆధ్వర్యంలో, సిపిఐ మండల సహయ కార్యదర్శి లింగ రవి ఆధ్వర్యంలో, హెచ్ఎమ్ఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తిప్పరపు కొంరయ్యా ఆధ్వర్యంలో పాల్గొన్నారు. భీమారం మండల కేంద్రంలో హమాలీ సంఘం నాయకులు ఆధ్వర్యలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు. అనంతరం కార్మికులకు టీషర్టులు అందించారు. జన్నారంలో హమాలి యూనియన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి సుందరయ్య నగర్ లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఎగురవేశారు.