గోదావరిఖని/ కరీంనగర్ టౌన్/ మెట్‌పల్లి, వెలుగు : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మేడే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కరీంనగర్ సిటీలోని మున్సిపల్ ఆఫీస్, బస్టాండ్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద, వ్యవసాయ మార్కెట్ వద్ద నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు జెండా ఆవిష్కరించారు. మెట్‌పల్లిలో హమాలీలు
ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గోదావరిఖని సింగరేణిలో, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు, అధికారులు ఎర్ర జెండా ఎగరేశారు. హుజూరాబాద్‌లో మున్సిపల్ కార్మికులు, ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.