మే డే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందన్నారు. కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని చెప్పారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం కార్మికుల అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందని చెప్పారు సీఎం. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. తెలంగాణ పునర్ నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.