మే నెలలో 3,34,247 కార్ల అమ్మకం

మే నెలలో 3,34,247 కార్ల అమ్మకం

న్యూఢిల్లీ:   ప్యాసింజర్ వెహికల్స్​ హోల్‌‌సేల్స్  గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈసారి మే లో 13.54 శాతం పెరిగి 3,34,247 యూనిట్లకు చేరాయి. యుటిలిటీ వెహికల్స్ అమ్మకాలలో బలమైన వృద్ధి కనిపించింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్​) తాజా డేటా ప్రకారం...  2022 మేలో తయారీదారుల నుంచి డీలర్‌‌లకు పంపిన కార్ల (పీవీలు) సంఖ్య 2,94,392 యూనిట్లు. సియామ్​ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ మాట్లాడుతూ  ఈసారి ప్యాసింజర్ వెహికల్స్​ అమ్మకాలు మే నెలలో ఎన్నడూ లేనంత అత్యధికంగా నమోదయ్యాయి. 

యుటిలిటీ వెహికల్ హోల్‌‌సేల్స్ (టాటా మోటార్స్ మినహా) గత నెలలో 33.5 శాతం వృద్ధి చెంది 1,55,184 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదేకాలంలో 1,16,255 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈసారి టూవీలర్​ హోల్‌‌సేల్స్​ 14,71,550 యూనిట్లు కాగా, గత ఏడాది మేలో 12,53,187 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2022 మే లో మోటార్‌‌సైకిళ్ల విక్రయాలు  8,19,940 యూనిట్లతో పోలిస్తే గత నెలలో  20.63 శాతం పెరిగి 9,89,120 యూనిట్లకు చేరుకున్నాయని సియామ్​ తెలిపింది.