శ్రీలంక బౌలర్ మలింగా బౌలింగ్ యాక్షన్ చూసి వామ్మో అనుకున్నాం. ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ స్టైల్ చూసి బయపడ్డాం. మరిప్పుడు జిమ్నాస్టిక్ బౌలింగ్ చూస్తే ఏం చేస్తారో...అదేంటి జిమ్నాస్టిక్ బౌలింగా ..? అదెలా వేస్తారు అనుకుంటున్నారా..?
విభిన్న బౌలింగ్ యాక్షన్
క్రికెట్ లో ఫాస్ట్ బౌలింగ్ ద్వారా కొందరు వెలుగులోకి వచ్చారు. ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ ల ద్వారా మరికొందరు ప్రపంచానికి పరిచమయ్యారు. కానీ ఫస్ట్ టైం ఓ బౌలర్ జిమ్నాస్టిక్ బౌలింగ్ ద్వారా అబ్బురపరుస్తోంది. ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహిళల టీ-20 ఛాలెంజ్ లో వెలాసిటీ బౌలర్ మాయా సోనావానే విభిన్న బౌలింగ్ యాక్షన్ తో ఔరా అనిపిస్తోంది.
మాయా బౌలింగ్
మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీలో మంగళవారం వెలాసిటీ, సూపర్ నోవాస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో వెలాసిటీ తరపున స్పిన్నర్ మాయా సోనావానే అరంగేట్రం చేసింది. అయితే తన విచిత్రమైన బౌలింగ్ యాక్షన్ తో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. సోనావానే బౌలింగ్ చేసేటప్పడు తన తలను బాగా కిందకు వంచి బౌలింగ్ చేస్తుంది. ఆమె బౌలింగ్ కు బ్యాట్స్ ఉమెన్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఆమె బౌలింగ్ చేస్తుందా? లేక జిమ్నాస్టిక్ విన్యాసం చేస్తుందా? అని గందరగోళానికి గురయ్యారు. ప్రస్తుతం సోనావానే బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Debut for 23 year old leg spinner from Maharashtra, Maya Sonawane#My11CircleWT20C#WomensT20Challenge2022 pic.twitter.com/IRylJ62EGx
— WomensCricCraze?( Womens T20 Challenge) (@WomensCricCraze) May 24, 2022
మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్‌తో పోలిక
సోనావానే బౌలింగ్ యాక్షన్ ను చూస్తుంటే సౌతాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పాల్ ఆడమ్ గుర్తుకు వస్తున్నారంటున్నారు మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు. సోనావానే బౌలింగ్ యాక్షన్ , పాల్ ఆడమ్ బౌలింగ్ యాక్షన్ ఒకే విధంగా ఉందని చెబుతున్నారు. పాల్ ఆడమ్ కూడా తలను కిందకు వంచి బౌలింగ్ చేసేవాడు. అయితే మొదట్లో ఆడమ్స్ బౌలింగ్‌ను ఆడేందుకు బ్యాట్సమన్ ఇబ్బంది పడ్డారు. బౌలింగ్ ను అర్థం చేసుకున్న తర్వాత చెలరేగారు. దాంతో అతని బౌలింగ్ కూడా సాధారణంగా మారిపోయింది.
గతేడాది ఉమెన్స్ సీనియర్ వన్డే ట్రోఫి ద్వారా మహరాష్ట్ర జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి మాయా సోనోవానే ఎంట్రీ ఇచ్చింది. ఏడు మ్యాచుల్లో నాలుగు వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత సీనియర్ ఉమెన్స్ వన్డే ఛాలెంజర్ ట్రోఫిలో ఇండియా ఏ ఉమెన్స్ టీమ్ లో ఆడింది. రెండు మ్యాచుల్లో రెండు వికెట్లు పడగొట్టింది.