టీమిండియా క్రికెటర్, సన్ రైజర్స్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జనవరి 30న తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరిన మయాంక్ అగర్వాల్ విమానంలో మంచి నీళ్లు అనుకొని హానికర ద్రావణాన్ని తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో విమాన సిబ్భందితో పాటు కర్ణాటక క్రికెట్ వర్గాలు అతడిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.
ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా.. విమానంలో ప్రయాణిస్తూ ఒక సొంత వాటర్ బాటిల్ తీసుకెళ్లాడు. మయాంక్ అగర్వాల్ తన ఎక్స్ (ట్విట్టర్)లో విమానంలో నీళ్లు తాగుతున్న సిప్పర్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. 'బిల్కుల్ భీ రిస్క్ నహీ లేనే కా రే బాబాఆఆ!' అనే క్యాప్షన్‌తో పాటు ఫోటోను పోస్ట్ చేశాడు. మయాంక్ చివరిసారిగా 2022 మార్చి శ్రీలంకతో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు మయాంక్. ఆస్ట్రేలియాపై చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. అతడు టీమిండియా తరఫున ఆడి రెండేళ్లు దాటిపోయింది.
Also Read : ముక్కోణపు సిరీస్.. భారత్‌లో పర్యటించనున్న నేపాల్ క్రికెట్ జట్టు
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ టీమ్‌కు మయాంక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం కర్ణాటక రంజీ టీమ్‌కు మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అనారోగ్య కారణంగా కొన్ని మ్యాచ్ లు అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో నిఖిన్ జోస్‌కు కెప్టెన్సీ చేశాడు. మయాంక్ అగర్వాల్ టీమిండియా తరఫున 21 టెస్ట్‌లు, ఐదు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో ఒక డబుల్ సెంచరీతో 1488 రన్స్ చేశాడు.
Indian batter Mayank Agarwal carries own water bottle after flight incident 😅#Cricket #RanjiTrophy #TeamIndia #IndianCricketTeam #MayankAgarwal #CricketTwitter pic.twitter.com/FuVdDYY5H9
— SportsTiger (@The_SportsTiger) February 20, 2024