
టీం ఇండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.అగర్తాల-ఢిల్లీ ఫ్లైట్లోనే అతను అస్వస్థతకు గురైన అతడిని హుటాహుటిన అగర్తాలోని ఐఎల్ జే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మయాంక్ ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడికి టెస్టులు చేస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం మయాంక్ ఆరోగ్యానికి ప్రమాదమేమి లేనట్లుగా తెలుస్తోంది. త్వరగా కోలుకోవాలని అతడి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం మయాంక్ రంజీ ట్రోఫీలో భాగంగా అతడు అగర్తాల వెళ్లాడు. కర్ణాటక జట్టుకు మయాంక్ కెప్టెన్ గా ఉన్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో కర్ణాటక టీం రైల్వేస్ తో ఫిబ్రవరి 2న మ్యాచ్ ఆడనుంది.
మయాంక్ 2018లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. భారత తరపున ఇప్పటి వరకు 21 టెస్టులు ఆడిన అతను 1488 పరుగులు చేశాడు. 4 సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఐదు వన్డేలు ఆడాడు.